హోలీ సంబ‌రాల్లో మ‌ల్లారెడ్డి

byసూర్య | Fri, Mar 14, 2025, 05:05 PM

డ్యాన్స్‌, స్పీచ్‌లతో అల‌రించే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల్లో పాల్గొన్నారు. హైద‌రాబాద్ బోయిన్‌ప‌ల్లిలోని త‌న నివాసం వ‌ద్ద మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర్ రెడ్డితో క‌లిసి వేడుక‌ల్లో సంద‌డి చేశారు. కుటుంబ స‌భ్యులతో క‌లిసి రంగులు పూస్తూ, కాసేపు మ‌నుమ‌రాళ్ల‌ను త‌న భుజాల‌పై మోసుకొని మాజీ మంత్రి డ్యాన్స్ చేశారు. ఇలా స‌ర‌దాగా నృత్యం చేసి, డ‌ప్పు కొడుతూ స్థానికులు, పిల్ల‌ల‌ను ఆయ‌న‌ ఉత్సాహ‌ప‌రిచారు. మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.      


Latest News
 

మేడ్చల్‌లో విద్యుత్ ఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి Fri, May 23, 2025, 04:23 PM
ఆసిఫాబాద్‌లో గ్రామస్తుల ఆవేదన.. ఇళ్లు కూల్చేస్తామని బెదిరింపులు Fri, May 23, 2025, 04:19 PM
ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. సీఎం రేవంత్ Fri, May 23, 2025, 04:14 PM
ఇళ్ల మధ్యలో చెత్త కుప్ప Fri, May 23, 2025, 04:11 PM
KCR అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి Fri, May 23, 2025, 04:09 PM