హోలీ సందర్భంగా యువత సందడి

byసూర్య | Fri, Mar 14, 2025, 04:56 PM

భాగ్యనగరంలో ఇవాళ(శుక్రవారం) హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగ సందర్బంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. యువతీ యువకులు రంగులు జల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నా రు.యువత బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. సిటీలో పలు ప్రాంతాల్లో హోలీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. డీజేల హోరు, బ్యాండ్ బాజాతో యువత సందడి చేస్తుంది.హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రిసార్ట్స్, గ్రౌండ్స్‌లో హోలీ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. డిఫరెంట్ థీమ్స్‌తో ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈవెంట్స్ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు.హోలీ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో రేపు (శనివారం) ఉదయం 6 గంటల వరకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తునట్లు పోలీసులు తెలిపారు. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులపై రంగులు జల్లొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM