![]() |
![]() |
byసూర్య | Tue, Feb 18, 2025, 12:38 PM
కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో డ్రైనేజీ మురుగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ పవన్ కుమార్ జలమండలి అధికారులకు సూచించారు. సత్యనగర్ కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లైన్లో డ్రైనేజీ మ్యాన్ హాల్స్ ధ్వంసమై మురుగునీరు తాగునీటిలో కలుస్తుందని స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. మ్యాన్ హాల్స్ మరమ్మతు చేసి డ్రైనేజీ మురుగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.