![]() |
![]() |
byసూర్య | Tue, Feb 18, 2025, 12:27 PM
తెలంగాణలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలో ఈటల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. తమిళనాడు చట్టబద్ధ కమిటీ వేసి చేసిందని.. బీహార్ కూడా అలానే చేసిందని గుర్తు చేశారు. కులగణన కాదనలేని సత్యమని..వద్దంటే ఆగేది కాదని..ఏ కులాన్ని విస్మరించలేమని స్పష్టం చేశారు. జనాభా పెరుగుతుంది అనేది సత్యం అని..మరి బీసీ జనాభా ఎలా తగ్గుతుందని..ఇంతకంటే దుర్మార్గపు లెక్కల మోసం ఏముంటుందన్నారు. 2011లో 3.61 కోట్లు ఉన్న రాష్ట్ర జనాభా 4 కోట్లు దాటి ఉంటుందని..అలాంటప్పుడు బీసీ జనాభా 46 శాతం ఉంటుందా ? అని ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డికి కులగణన..బీసీ రిజర్వేషన్లపై నిజాయితీ లేదని..బ్లఫ్ చేసి మోసం చేసి లెక్కలు ప్రకటించారని. మోసం చెయ్యకు అని మరోసారి చెప్తున్నానన్నారు. ప్రభుత్వం అంటే డ్రామా కంపనీ కాదని..రిజర్వేషన్లు, కులగణనపై మాట ఇస్తే తప్పవద్దని రేవంత్ కు హితవు పలికారు. ప్రధాని మోదీ మాట ఇస్తే అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు.