మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు

byసూర్య | Tue, Feb 18, 2025, 10:48 AM

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు. వేలం పాటలో రూ. 16.65 లక్షలకు అమ్ముడుపోయిన 84 కోళ్లు. ఈ నెల 12న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్టలో ఓ ఫాంహౌస్లో కోడి పందేలు నిర్వహిస్తూ 64 మంది పట్టుబడగా 85 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఒకటి మృతిచెందగా మిగిలిన వాటిని రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారుఅయితే న్యాయమూర్తి వేలంపాట నిర్వహించడంతో.. వేలంపాట సమాచారం అందుకున్న పందెం రాయుళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో ఏపీ లోని రాజమహేంద్రవరం, ఏలూరు, నూజివీడు తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు. ఇదే కేసులోని నిందితుల అనుచరులు సైతం పాల్గొని తమ కోళ్లను దక్కించుకున్నారు


Latest News
 

ప్లాస్టిక్​ వాడొద్దు... పర్యావరణాన్ని నష్టపరచొద్దు: మంత్రి కొండా సురేఖ Thu, Mar 27, 2025, 09:01 PM
అల్మాస్గూడలో హైడ్రా దూకుడు... Thu, Mar 27, 2025, 08:57 PM
బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా విష్ణువర్ధన్ రెడ్డి విజయం Thu, Mar 27, 2025, 08:46 PM
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు Thu, Mar 27, 2025, 08:43 PM
గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం Thu, Mar 27, 2025, 08:34 PM