![]() |
![]() |
byసూర్య | Tue, Feb 18, 2025, 10:19 AM
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర రెండవ రోజు సోమవారం భక్తులు పోటెత్తారు. రెండవ రోజు చౌడమ్మ బోనాలు సమర్పించారు. మహిళా భక్తులు బోనాలతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.లింగమంతులస్వామి జాతర మూడో రోజైన మంగళవారం ఉదయం చంద్రపట్నం వేస్తారు. యాచకులతో కలిసి రాజులు, పూజారులు గుడి ప్రాంగణంలో చంద్రపట్నం వేసి భైరవునికి పోలు రాస్తారు. ఆదివారం అర్ధరాత్రి కేసారం గ్రామం నుంచి వచ్చిన ఎడ్ల బండ్లేకాక వివిధ వాహనాలు ప్రత్యేక పూజల అనంతరం కేసారానికి తిరుగు ప్రయాణమవుతాయి. భక్తులు చంద్రపట్నం వీక్షించడానికి భారీగా హాజరవుతారు.