క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి ముందుకు సాగండి..

byసూర్య | Mon, Feb 17, 2025, 08:58 PM

క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ఆడి తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రికెట్ క్రీడలో రాణించాలని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సర్ధార్ పటేల్  స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్  ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. తొలుత మంత్రి తనయుడు తుమ్మల యుగంధర్ కు క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ మతీన్, సాయినిరంజన్ ఫరీద్ ఖాద్రి, సీనియర్ క్రీడాకారిణి అంజలిలు  పుష్పగుచ్ఛo అందజేసి స్వాగతం పలికారు. క్రీడాకారుల పరిచయ కార్యక్రమo అనంతరం టాస్ వేసి  టోర్నమెంట్ ని ప్రారంభించారు.
 టోర్నమెంట్ ప్రారంభం ముందు తుమ్మల యుగంధర్ బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. తొలి మ్యాచ్ లో  కొత్తగూడెం అర్బన్, ఖమ్మం అర్బన్ టీమ్ లు పాల్గొనగా  టాస్ గెలిచిన ఖమ్మం అర్బన్ టీమ్ బ్యాటింగ్ చేసింది. ఈ మేరకు  నిర్వాహకులు తుమ్మల యుగంధర్ కు, టోర్నమెంట్ ప్రారంభోత్సవ సహాయకులు మహమ్మద్ అశ్రీఫ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో క్రీడాకారులు నాగేశ్వరావు, మారుతి శ్రీను, ఇమ్రాన్, సిద్దు, కుక్కల మహేష్ తదితరులు పాల్గొన్నారు..


Latest News
 

గ్యాస్ ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ Tue, Mar 10, 2026, 12:01 PM
2026 శ్రీరామ నవమి తేదీపై క్లారిటీ Tue, Mar 10, 2026, 11:56 AM
రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీల్లో శిక్షణ,,,మల్లేపల్లి ఏటీసీలో షార్ట్ టెర్మ్ కోర్సులు Mon, Mar 09, 2026, 10:56 PM
గతంలో సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు బతికారన్న అనిరుధ్ రెడ్డి Mon, Mar 09, 2026, 08:42 PM
అధిష్టానం వైపు అడుగులు – ‘రాహుల్ బంధు’ Mon, Mar 09, 2026, 08:31 PM