![]() |
![]() |
byసూర్య | Sun, Feb 16, 2025, 02:08 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావాలని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ పిలుపునిచ్చారు. శనివారం రోజున సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలోని ఆరుట్ల భవన్ లో జరిగిన తీగుల్ గ్రామ శాఖ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నో విజయాలను, ఎన్నో ఫలితాలను దేశ ప్రజలకు అందించిందని, పేద ప్రజలకు విద్య,వైద్యం ఉచితంగా అందాలని కూడు,
గూడు కోసం అనేక పోరాటాల నిర్వహించిందని ఆయన అన్నారు. దేశంలో ప్రస్తుతం పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయపడుతుందని, ప్రజల ఆర్థిక స్థితిగతులు చిన్నభిన్నమవుతున్నాయని, పేదరికం పెరిగిపోతుందని, బిజెపి పాలనలో బడా కార్పొరేట్ శక్తులకు ఉన్న ప్రాధాన్యత,సామాన్య ప్రజలకు రైతులకు అందడం లేదని ఇలాంటి పరిస్థితులలో బిజెపి పరిపాలనపై పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి పోరాటాల నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని గ్రామాలలో పోటీ చేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర నాయకులు బట్టు దయానంద రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో ఏ పార్టీకి లేని చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఉన్నదని నాడు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుకొని నేటి ప్రత్యేక తెలంగాణ కోసం నిరంతరం సిపిఐ పోరాటం చేసిందని, నాటి నుంచి నేటి వరకు పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, సీపీఐ వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను గ్రామ గ్రామాన నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జగదేవ్ పూర్ మండల కార్యదర్శి నరసింహ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ, స్వర్గం రాజేశం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి బేల్దే బిక్షపతి, నాయకులు పోషన్న, సైదులు, తదితరులు పాల్గొన్నారు..