![]() |
![]() |
byసూర్య | Sun, Feb 16, 2025, 02:07 PM
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా దుండిగల్ మున్సిపాలిటీ తండా లో జరిగిన జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ జీవిత సందేశాలు సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయని, ఆయన బోధనలు ఆదివాసీ, గిరిజన సమాజ అభ్యున్నతికి తోడ్పడటమే కాకుండా, సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ, జక్కుల కృష్ణ యాదవ్, శంకర్ నాయక్, మహేందర్ యాదవ్, సాయి యాదవ్, నాయకులు, విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ నాయక్, ప్రవీణ్ నాయక్, ప్రేమ్ సింగ్, అమర్ సింగ్, నగేష్, ఆకుల భాస్కర్, దశరథ్, హనుమంత్ రెడ్డి, మహిళా నాయకురాలు పడాల మనోజ, శాంత బాయ్ మరియు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు..