![]() |
![]() |
byసూర్య | Sun, Feb 16, 2025, 12:19 PM
వికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నెంబర్ 4 శివ రెడ్డి పేటలో నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ వలన చాకలి అనంతమ్మకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఇట్టి విషయంపై వెంటనే స్పందించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఆర్ద సుధాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతమ్మ గారి నివాసానికి వెళ్లి కాళిపోయిన ఇంటిని పరిశీలించి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా కొత్త ఇల్లు నిర్మించి ఇస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా వికారాబాద్ తహసీల్దార్ కు సమాచారం అందించి నష్టపరిహారం కూడా ఇప్పిస్తామని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ కౌన్సిలర్ మధుకర్ , మాజీ కౌన్సిలర్లు మురళి, వేణుగోపాల్ రెడ్డి, నాయకులు రేడ్యా నాయక్, ఆసిఫ్, శ్రీనివాస్ ముదిరాజ్,శంకర్, మధు, ప్రవీణ్ మణి తదితరులు పాల్గొన్నారు.