![]() |
![]() |
byసూర్య | Sun, Feb 16, 2025, 12:16 PM
చేవెళ్ల పట్టణంలో యండీ అజర్, యండీ ముస్తఫాలు నూతనంగా ఏర్పాటు చేసిన ఆదాబ్ రెస్టారెంట్‌ను కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ స్థానిక నాయకులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రెస్టారెంట్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నదని, ఇలాంటి రెస్టారెంట్‌ల అవశ్యకత ఉందన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా వారంలో ఒక సారైనా కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు కల్పించాలన్నారు.
రెస్టారెంట్ నిర్వహకులు అజర్, ముస్తఫాలు మాట్లాడుతూ.. తమ రెస్టారెంట్‌లో అన్నిరకాల వెజ్,నాన్ వెజ్ రుచికరమైన వంటకాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంతకు ముందు రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భీమ్ భరత్, స్థానిక నాయకులకు రెస్టారెంట్ నిర్వహకులు పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల సహకార సంఘం చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంగలి బాల్ రాజ్, చేవెళ్ల, దామరగిద్ద మాజీ సర్పంచులు బండారి శైలజా ఆగిరెడ్డి, రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, చేవెళ్ల సహకార సంఘం డైరెక్టర్ ఫైండ్ల మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, చేవెళ్ల మాజీ వార్డ్ మెంబర్ మల్గారి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.