![]() |
![]() |
byసూర్య | Wed, Feb 12, 2025, 12:51 PM
ఒత్తిడి లేకుండా చదివితేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విద్యార్థులకు సూచించారు. మెట్ పల్లి పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు.
పదవ తరగతి పరీక్షలకు సన్నద్దమౌతున్న విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివి తల్లిదండ్రులు గర్వపడేలా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. హాస్టల్లో వసతి సౌకర్యాల గురించి, భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.