నేడు తెలంగాణలో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం

byసూర్య | Wed, Feb 12, 2025, 11:57 AM

తెలంగాణలోని రాజకీయ పార్టీలతో ఈసీ బుధవారం ఉ. 11.30 గంటలకు సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’'నోటా' తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాలు పాటిస్తున్నట్లు.. పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా తమకు అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేయాలనే పద్ధతిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా్యి. 2013లో పోలింగ్ శాతం పెంచ‌డానికి నోటాను ప్రవేశ‌పెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. పోటీలో నిల‌బ‌డ్డ అభ్యర్థులు ఎవ‌రూ న‌చ్చక‌పోయిన క‌నీసం నోటాకు ఓటు వేయాల‌న్నది కోర్టు ఉద్దేశ్యం, అయితే, నోటాకు ఎన్ని ఓట్లు వ‌చ్చినా అది ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్రభావం చూపించడం లేదు. గతంలో మ‌హారాష్ట్ర, హ‌ర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో జరిగిన లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల్లో ఆయా రాష్ట్రాల ఈసీలు నోటాను ఒక క‌ల్పిత క్యాండిడేట్‌గా గుర్తించాయి. దీని ప్రకారం.. ఎన్నికల్లో నోటాకు అధిక ఓట్లు వస్తే తిరిగి ఎన్నిక‌లు నిర్వహించ‌వలసి ఉంటుంది.ఇదిలా ఉండగా, పలు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల్లో స‌ర్పంచ్ పోస్టును వేలం వేస్తున్నారు. ఇప్పటికే వేలం ప్రక్రియ సైతం మొదలైంది. దీనికి చెక్​పెట్టి ప్రతీ గ్రామంలో ఎన్నిక నిర్వహించేలా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఆలోచలను తెలుసుకునేందుకు ఈసీ బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మాసాబ్​ట్యాంకులోని ఈసీ ఆఫీసులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణికుముదిని అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ కానుంది. ఇందులో ఎన్నికల ఏర్పాట్లతో పాటు పొలిటికల్ లీడర్ల అభిప్రాయాలను తెలుసుకోనున్నది. ఈ నెల 15 లేదా 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశమున్నది.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM