నేటి నుండి నాలుగు రోజులపాటు మేడారం మినీ జాతర

byసూర్య | Wed, Feb 12, 2025, 11:06 AM

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.  మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాతరలో సమ్మక్క- సారలమ్మ జాతర ఒకటి . ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క - సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. అమ్మవార్లకు బెల్లాన్ని(బంగారాన్ని) సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికెడు తీసుకెళ్లినా చాలు.. ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.


 


 


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM