బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు

byసూర్య | Wed, Feb 12, 2025, 10:44 AM

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు.ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని శ్రీ బాలాజీ ఫౌల్ట్రీ ఫామ్ లో( Bird Flu) భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని సూచించారు వెటర్నరీ అధికారులు. అధికారుల సూచన మేరకు చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టారు ఫౌల్ట్రీ యజమాని. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు, కోళ్లు, గుడ్లను పుడ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్‌ శివారులో కోడి పందాలు.. క్యాసినో, ఫామ్ హౌస్‌పై దాడి చేసి 64 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..55 లగ్జరీ కార్లు సీజ్, వీడియో ఇదిగో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. రామాపురం ఎక్స్ రోడ్డులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్ల తనిఖీలు చేపట్టగా ఆంధ్ర నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేసి వాటిని తెలంగాణలోకి రాకుండా జాగ్రత్తలు చేపట్టారు.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM