![]() |
![]() |
byసూర్య | Sun, Feb 09, 2025, 11:04 PM
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న షాపుల పై చర్యలు తీసుకోకుండా రైతులు వరి పంటను సమయానికి వేయలేదని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.45 రోజులకే వరి పంట ఈనుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.కౌలు రైతు కళ్ళల్లో కన్నీళ్లే మిగిలాయంటూ లబోదిబో మొత్తుకుంటున్నారు. అయితే ఈమధ్య కాలంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో కోదాడ నియోజవర్గంలో ఉన్న మండలాల్లో వరి పొలాలను తనిఖీలు నిర్వహించారు. కాగా అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన పొనుగోటి ధనమూర్తి తాను వరి పంట వేయటకు భవాని ఫర్టిలైజర్ షాప్ లో 10 బ్యాగుల విత్తనాలు తీసుకోవడం జరిగింది.
అవి తీసుకున్న 45 రోజులకే వరి నారు ఈనడంతో ఆగ్రహానికి గురైన రైతు వ్యవసాయ అధికారులను సంప్రదించారు. అధికారులు షాప్ యజమానిపై చర్యలు తీసుకోకుండా రైతులకే సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చెందారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ విత్తనాల షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు,కౌలు రైతులు కోరుతున్నారు.