![]() |
![]() |
byసూర్య | Sun, Feb 09, 2025, 11:01 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండ లంలో పేకాట స్థావరంపై దాడి చేసి పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు కాగజ్‌నగర్ డిఎస్పీ రామా నుజం,కౌటాల సిఐ రమేష్ ఆదేశాల మేరకు సిర్పూర్ (టి) పోలీసులకు అందిన పక్క సమాచారం మేరకు సిర్పూర్(టి)పోలీసు స్టేషన్ పరిధిలోని హుడికిలి గ్రామ శివారులో పేకాట ఆడు తుండగా అట్టి పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న కొందరు పారిపోవడంతో దొరికిన ఇద్దరిని అదుపులోతీసుకొని విచారించడంతో మొత్తం తొమ్మిది మంది పేకాట ఆడుతున్నట్లు తెలిపారు.సిర్పూర్ (టి) ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడుతున్న పాల్ రమేష్, ఎల్ములే సాగర్ లను అదుపులోతీసుకోని విచారించ గా!ఏడుగురు పారిపోయా రని అన్నారు.
పారిపోయిన వారిలో కిర్మిరే బాపురావు, చౌదరి సాయినాథ్, చౌదరి బంర్, చౌదరి ప్రవీణ్, కిర్మిరే నవీన్, కుర్సంగి మారుతి, చందన్ కర్ సుధాకర్ లు పారిపోయారని అన్నారు. పట్టు బడ్డ ఇద్దరితో పాటు పారిపోయిన ఏడుగురిని కలిపి మొత్తం 9 మంది వ్యక్తులు పై కేసు నమోదు చేసి వీరి వద్ద నుండి 800/- రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, రెండుపేకాట సెట్స్ స్వాధీనంచేసుకోని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కమలాకర్ తెలిపారు మండలంలో పేకాట, క్రికెట్ బిట్టింగ్ లు, జూదం, కోడి పందాలు, మాట్కా, ఆటలను సహించేలేదని అన్నారు.ఇలాంటి కార్య కలాపాలను ఎవరైనా నిర్వ హిస్తున్నారని తెలిస్తే కేసులు నమోదు చేసిచట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పేకాట, జూదం మట్కా,క్రికెట్ బెట్టింగ్లు,కోడి పందాలు వాటితో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్సై కమలాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ (టి) ఎస్ఐ కమలకర్ తోపాటు పోలీసులు పాల్గోన్నారు.