హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌..

byసూర్య | Sun, Feb 09, 2025, 10:56 PM

పెద్దపల్లి పట్టణంలో ప్రధాన రహదారులపై త‌రుచూ రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి.ఈ రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు గాయల పాలు అవుతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయ‌డం కార‌ణంగానే రోడ్డు ప్ర‌మాదాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పెద్దపల్లి లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాంగ్ రూట్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రాంగ్ రూట్ లో వెళ్తున్న 74 మంది వాహనదారుల కు జరిమానాలు విధించడం జరిగింది.అనంతరం వారికి అవగాహన కల్పించడం జరిగింది.రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
దగ్గరే కదా.. రాంగ్ రూట్ లో వెళ్దాం, ఏమీ కాదులే అని అనుకుంటున్నారా? అర్జంట్ పని ఉంది రాంగ్ రూట్ లో ప్రయాణం చేయడం చాలా  మీతో పాటు ఎదుటి వాహనదారులకు చాలా ప్రమాదం అని, ముఖ్యంగా హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయ‌డం కార‌ణంగానే రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్న‌ట్లు సీఐ అన్నారు. గత జనవరి మాసంలో నెల రోజులు అవగాహన అన్ని వర్గాల ప్రజలకు కల్పించినాము, పట్టణం లో ని జంక్షన్ లలో రాంగ్ రూట్ లో వెళ్లరాదని ఫ్లెక్సీ లు కూడా ఏర్పాటు చేసిన ప్రజలలో మార్పు రావటం లేదని, రేపటి నుండి ఎవరినైనా రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే బారీగా జరిమానాలు విధించడం తో పాటుగా వాహనాలు సిజ్ చేయడం జరుగుతుంది,రాంగ్ రూట్ వెళ్లే వారి వలన సరైన మార్గం లో వెళ్లే వారికి ప్రమాదం ఉంది కావున వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ  తెలిపారు.


Latest News
 

మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM
హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM
KTR సిగ్నల్: 14 తర్వాత రాష్ట్రంలో ఎవరు దూకుడుగా ఉంటారో గమనిస్తాం!” Sat, Nov 08, 2025, 11:17 PM
“జూబ్లీహిల్స్ రాజకీయ రణభూమి: టీడీపీ-బీజేపీ గ్యాప్ పెరుగుతోంది” Sat, Nov 08, 2025, 10:47 PM