10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

byసూర్య | Sun, Feb 09, 2025, 10:55 PM

మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి మంజూరైన జాతీయ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) నిధులు రూ.5లక్షలు, స్పెషల్ డెవలప్ మెంట్(ఎస్డీఎఫ్) నిధులు రూ.5లక్షలతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు పనులను ఆ గ్రామ మాజీ సర్పంచ్ కేసారం శ్రీనివాస్ గ్రామస్తులతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గ్రామంలో మోళిక వసతులను మెరుగు పరచుకునేందుకు ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణం పనులు కోసం రూ.10లక్షలు మంజూరు చేశారన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోటూరి సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మొకిల కిష్టయ్య, రావులపల్లి గ్రామ మాజీ సర్పంచులు గోటూరి బాలయ్య,  కావలి బుచ్చయ్య, పట్లోళ్ల హనుమంత్ రెడ్డి, బాల్ రాజ్ గ్రామ మాజీ వార్డు మెంబర్లు, నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM