హైదరాబాదులోని సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి

byసూర్య | Sun, Feb 09, 2025, 05:45 PM

హైదరాబాదులోని సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుడ్ని కూడా దుండగులు గాయపరిచారు. ఈ దాడిపై రంగరాజన్, చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని పలు హిందూ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM