![]() |
![]() |
byసూర్య | Sat, Feb 08, 2025, 07:50 PM
భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారు అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు నిర్వహించే కోటి కుంకుమార్చనను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.