![]() |
![]() |
byసూర్య | Sat, Feb 08, 2025, 07:46 PM
బజార్హత్నూర్ మండలం చింతలసాంగ్వి గ్రామంలో ఆదివాసి యూత్ ఆద్వర్యంలో నిర్వహించిన కబడ్డి టోర్నమెంట్‌ను మాజీ ఎంపీ సోయం బాపు రావు శనివారం ప్రారంభించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ క్రీడా పోటీలు క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే కాకుండా ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తాయని అన్నారు. గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలన్నారు. మాజీ జెడ్పిటిసిలు నరసయ్య, మునేశ్వర్, మాజీ ఎంపీపీ పోరెడ్డి శ్రీను తదితరులున్నారు