రాజాసింగ్ సంచలన ఆరోపణలు

byసూర్య | Fri, Jan 24, 2025, 08:36 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచాల అడ్డాగా మారిందని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కప్పుడు కానిస్టేబుల్,ఎస్ఐ, ఇన్‌స్పెక్టర్ లంచాలు తీసుకోవాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు అలా లేదని అన్నారు.ఈ మధ్యలో కరీంనగర్, జమ్మికుంట పోలీసుస్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ రవి రూ. 3లక్షలు ఒక బాత్రూమ్‌లో పెట్టా అని, సీసీటీవీలో చూడమని ఒక బాధితుడు ఆడియో వైరల్ అయిందని తెలిపారు. ఈరోజు తన సొంత నియోజకవర్గం గోశామహల్‌లో సాయినాథ్ గంజ్ పోలీస్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాబు చోహన్ ఓ కేసులో పేరు తొలగించడానికి రూ.1.50,000లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈరోజు రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారని అన్నారు.ఈ సంవత్సరం చాలామంది పోలీస్ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని గుర్తుచేశారు. ప్రజలకు అండగా ఉండి, సమాజానికి రక్షణ కల్పించే పోలీసులు ఇలా లంచాలు తీసుకుంటే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టేవిధంగా నగర సీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లంచాలు తీసుకున్న పోలీస్ అధికారులను విధుల నుంచి వెంటనే తొలగించే విధంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీజీపీ ,సీపీ, డీసీపీలు స్పందించి ఇలాంటి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM