రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్

byసూర్య | Tue, Jan 21, 2025, 09:31 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పీఏను అంటూ ఓసారి... ఓ ఏపీ మాజీ మంత్రి కుమారుడిని హనీట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసి మరోసారి... ఇలా ఎన్నో కేసుల్లో ఉండి తప్పించుకొని తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్థుడు బుర్హానుద్దీన్‌ను తెలంగాణలోని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్‌లలో 15 కేసులు ఉన్నాయి.భూకబ్జా, బెదిరింపులు, మోసాలు, దాడులు సహా వివిధ కేసులు బుర్హానుద్దీన్‌పై ఉన్నాయి. అతని గురించి పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. నిందితుడు 2011లో మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ నాటి ఝార్ఖండ్ సీఎంకు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.గతంలో రాహుల్ గాంధీ పీఏనంటూ పలువురిని మభ్యపెట్టినట్లు గుర్తించారు. ఆ కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లాడు. ఏపీ మాజీ మంత్రి తనయుడిని హనీ ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈడీ కేసులో ఓ ఐఏఎస్ అధికారిని కూడా బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లు చెప్పారు.నిందితుడిపై ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోలీసులు అతనిపై రౌడీషీట్ కూడా తెరిచారు. తాజాగా, తొమ్మిది మందితో కలిసి హాకీ స్టిక్స్, ఇనుపరాడ్లు పట్టుకొని తిరుగుతూ స్థలం కబ్జాకు ప్రయత్నించాడని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో బుర్హనుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM