రోడ్డుపై బైఠాయించి ఆందోళన ..

byసూర్య | Mon, Jan 20, 2025, 12:52 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ‘మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.    మరోవైపు మైలారంలో స్థానికులకు మద్దతు తెలిపేందుకు పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గడ్డం లక్ష్మణ్‌ హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వచ్చారు. వారిని వెల్దండ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. 


 


 


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM