సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

byసూర్య | Mon, Jan 20, 2025, 12:42 PM

 ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్ చేరుకుని, సోమవారం ఉదయం పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకున్నారు.ఇదిలా ఉంటే.. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి దావోస్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో, రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించేందుకు తమ ప్రత్యేకమైన ప్లాన్‌లను సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు “బ్రాండ్ ఏపీ”తో, రేవంత్ రెడ్డి “రైజింగ్ తెలంగాణ”తో దావోస్ వెళ్లారు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల బృందాలు దావోస్‌ కలిసిన ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఏపీ బృందం తరుఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు లు ఉండగా.. తెలంగాణ బృందం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబులు ఉన్నారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM