తెలంగాణలో హామీలు, మోసాలపై ప్రజలకు వివరిస్తామన్న అర్వింద్

byసూర్య | Fri, Jan 17, 2025, 06:28 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇద్దరికీ లైడిటెక్టర్ పరీక్షలు చేస్తే వారి బండారం బయటపడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... వారిద్దరికీ లైడిటెక్టర్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు సమయంలో నోట్ల కట్టలు తీసుకువెళ్లమని రేవంత్ రెడ్డికి, ఈ-రేసింగ్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించాలని కేటీఆర్‌కు ఎవరు చెప్పారో తెలియాలన్నారు.తెలంగాణలో హామీలు, మోసాలపై ప్రజలకు తాము వివరిస్తామన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలను ఢిల్లీకి తీసుకువచ్చి మరీ అక్రమాలు చేశారన్నారు.కాగా, నిన్న ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... తాను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని, రేవంత్ రెడ్డి కూడా సిద్ధమా? అని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ధర్మపురి అర్వింద్ స్పందించారు.


Latest News
 

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. వైద్య శాఖలో 10 వేల కొలువుల జాతర! Wed, Jan 14, 2026, 06:59 PM
భూముల సేఫ్టీకి 'హైడ్రా-లెడ్జర్' కవచం.. ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ - ప్రభుత్వం సంచలన నిర్ణయం! Wed, Jan 14, 2026, 06:47 PM
గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM
నల్లమలసాగర్‌పై ఏపీని కట్టడి చేసేలా తెలంగాణ వ్యూహం: 18న మేడారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం Wed, Jan 14, 2026, 05:48 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముఖాముఖి ఢీకొన్న బైక్‌లు, ఒకరి పరిస్థితి విషమం Wed, Jan 14, 2026, 05:41 PM