ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ త్రీ టౌన్‌ పీఎస్‌లో మరో ఫిర్యాదు

byసూర్య | Mon, Jan 13, 2025, 02:58 PM

బీఆర్ఎస్ పార్టి నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేఆర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సవాల్లు విసిరిన ఆయన, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో అధికారిక కార్యక్రమంలో దురుసుగా ప్రవర్తించారుడు దీంతో ఆయనపై ఫిర్యాదుల చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మరో ఫిర్యాదు నమోదు అయింది. ఈ నెల 10 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమా కు సంబంధించి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ త్రీ టౌన్‌ పీఎస్‌లో మరో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులో గేమ్‌ ఛేంజర్‌ టికెట్ల ధరలను పెంచడంతో సీఎంపై కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలలు చేశారని, సీఎంపై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM