జాతీయ మెగాలోక్ అదాలత్

byసూర్య | Thu, Dec 12, 2024, 02:15 PM

ఈ నెల 14న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,  తెలిపినారు. ఎస్పీ   మాట్లాడుతూ ఈ నెల 14న  జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసు లు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపినారు. రాజీయే రాజ మార్గమన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు.
జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.జిల్లా లోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది అని ఎస్పీ  తెలియజేయడం జరిగింది.


Latest News
 

వేములవాడ భక్తులకు భారీ శుభవార్త.. ఇక నుంచి తిరుపతి తరహాలో, నిత్యం ఉచితంగా Mon, Jan 13, 2025, 08:09 PM
ఖమ్మంలో సీక్రెట్‌గా కోడి పందాలు.. కనిపెట్టేందుకు పోలీసుల సూపర్ ఐడియా..! Mon, Jan 13, 2025, 07:58 PM
పక్కా పకడ్బందీగా రైతు భరోసా.. మరి సాగు యోగ్యంకాని భూములను ఎలా గుర్తిస్తారు Mon, Jan 13, 2025, 07:53 PM
2014లో కాదు 2009లోనే తెలంగాణ రావాల్సింది.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ సీఎం Mon, Jan 13, 2025, 07:45 PM
ఆ కార్డు ఉంటేనే ఖాతాలోకి రూ.12 వేలు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిబంధనలివే. Mon, Jan 13, 2025, 07:41 PM