byసూర్య | Tue, Dec 10, 2024, 04:12 PM
కూకట్ పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ రోడ్డు నెంబర్ 2 లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పెండింగ్ ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మంగళవారం కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు మంజూరు చేయించి, త్వరలో సీసీ రోడ్డు నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు.