byసూర్య | Tue, Dec 10, 2024, 04:05 PM
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ తల్లిని మార్చి సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం దుర్మార్గమైన చర్య అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రాంనగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.