byసూర్య | Mon, Dec 02, 2024, 04:28 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30ని (Police Act) అమలు చేస్తున్నారు. సోమవారం (డిసెంబర్ 2) నుంచి జనవరి 1 వరకు జిల్లా అంత ఆమలులో ఉండనున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ డీ. జానకి వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి బహిరంగ సమావేశాలు కానీ, ఊరేగింపులు, ధర్నాలు జరుపకూడదని తెలిపారు. నిషేధిత ఆయుధాలైన కత్తులు, చాకులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, నేరాలకు పురిగొల్పే ఎలాంటి ఆయుధాలను వాడకూడదని చెప్పారు. భారీగా జనసమూహాన్ని పోగుచేసే సమావేశాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలపై కూడా నిషేధం ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపారు.