byసూర్య | Mon, Dec 02, 2024, 03:00 PM
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈస్ట్ జోన్ ఏసీపి సంపత్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆదేశాల మేరకు చిలకలగూడ ట్రాఫిక్ సీఐ సిహె. చ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆలుగడ్డబావి జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, హెల్మెట్ వాడకం, ఓవర్టేక్, రాంగ్ రూట్లో వెల్లడంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని ఏసిపి హెచ్చరించారు.