byసూర్య | Mon, Dec 02, 2024, 02:09 PM
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాకు అంతేలేకుండా పోయింది. గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు విశ్వస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో గంజాయి పట్టుబడుతూనే ఉంది.తాజాగా దాదాపు 17 లక్షల విలువైన 60 కిలోల గంజాయిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. చందానగర్ పోలీసులతో కలిసి పెద్ద మొత్తంలో గంజాయిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. ఒకరు పరారీలో ఉన్నారు.