byసూర్య | Mon, Dec 02, 2024, 12:10 PM
ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా విధులు నిర్వహిస్తు ఆత్మహత్య చేసుకున్న హరీష్ సర్వీస్ రివల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సొంత గ్రామం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం, 2020 బ్యాచ్ కు చెందిన హరీష్ గతంలో వాజేడు పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్ఐగా మొదటి సారిగా విధులు నిర్వహించాడు. తర్వాత వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించాడు. గత ఆరు నెలల నుండి వాజేడు పోలీస్ స్టేషన్ ఎస్సై గా నిధులు కొనసాగిస్తూన్నాడు. ముళ్ళకట్ట పూసురు వద్ద వున్న ఫిరియాడో రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకుని మృతి చెందారు.ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి వుంది.