byసూర్య | Mon, Dec 02, 2024, 11:19 AM
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రసాదాల కౌంటర్ల వద్ద బారులుదీరారు. స్వామివారికి ఈరోజు ముత్యాలతో పొదిగిన వస్త్రాలను అలంకరించారు. దీన్ని ముత్తంగి అలంకారం అని పిలుస్తారు. ఈ రూపంలోని సీతారామ లక్ష్మణులను భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.