byసూర్య | Mon, Dec 02, 2024, 11:15 AM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పెదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కురుమార్తి బ్రహ్మోత్సవాల చివరి రోజు, ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారి సన్నిధిలో నిద్రాహారాలు చేశారు. సోమవారం తెల్లవారుజామున కోనేరులో స్నానాలు ఆచరించి భక్తశ్రద్ధలతో కురుమూర్తి రాయుడుని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.