కన్నడ నటి శోభిత హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడింది

byసూర్య | Sun, Dec 01, 2024, 09:58 PM

కన్నడ నటి శోభిత హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడింది. శోభిత గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శోభిత తెలుగులోనూ అనేక టీవీ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ టాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించిన ఆమె, మరిన్ని అవకాశాల కోసం హైదరాబాదులోనే స్థిరపడింది. ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శోభిత 2023లో వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు సుధీర్. పెళ్లయిన ఏడాదికే ఆమె ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. శోభిత స్వస్థలం కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేశపుర ప్రాంతం. హైదరాబాదులో పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం : మంత్రి సీతక్క Fri, Jan 24, 2025, 08:38 PM
రాజాసింగ్ సంచలన ఆరోపణలు Fri, Jan 24, 2025, 08:36 PM
మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్య Fri, Jan 24, 2025, 08:29 PM
తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు Fri, Jan 24, 2025, 08:26 PM
బంగారం ధర కొత్త రికార్డ్ Fri, Jan 24, 2025, 08:20 PM