కన్నడ నటి శోభిత హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడింది

byసూర్య | Sun, Dec 01, 2024, 09:58 PM

కన్నడ నటి శోభిత హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడింది. శోభిత గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శోభిత తెలుగులోనూ అనేక టీవీ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ టాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించిన ఆమె, మరిన్ని అవకాశాల కోసం హైదరాబాదులోనే స్థిరపడింది. ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శోభిత 2023లో వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు సుధీర్. పెళ్లయిన ఏడాదికే ఆమె ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. శోభిత స్వస్థలం కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేశపుర ప్రాంతం. హైదరాబాదులో పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

నాంపల్లిలో అగ్నిప్రమాదం,,,,భవనంలో చిక్కుకున్న ఆరుగురు Sat, Jan 24, 2026, 07:55 PM
విధుల్లో ఉండగా కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు,,,,గంజాయి బ్యాచ్ బరితెగింపు Sat, Jan 24, 2026, 07:50 PM
ఆడంబరాలకు స్వస్తి.. ఆదర్శానికి నాంది,,,,,రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు Sat, Jan 24, 2026, 07:44 PM
ఉచితం కాదు.. మీ నెత్తినే అప్పు,,,,,ఇందిరమ్మ చీరలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు Sat, Jan 24, 2026, 07:39 PM
నుమాయిష్‌కు వెళ్లకండి,,,,,సీపీ సజ్జనార్ విజ్ఞప్తి Sat, Jan 24, 2026, 07:35 PM