![]() |
![]() |
byసూర్య | Wed, Nov 13, 2024, 10:28 AM
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు కల్వర్టును ఢీకొని మృతి చెందాడు. హన్మ కొండ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన డి. రామకృష్ణ(26) మంగళవారం రాత్రి హన్మకొండ నుంచి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఆలేరు బైపాస్ రోడ్డులో మ్యాడీస్ హోటల్ దగ్గరకి రాగానే కల్వర్టును ఢీకొట్టి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడి మృతి చెందాడు.