byసూర్య | Tue, Nov 12, 2024, 09:56 PM
కామారెడ్డి లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య కోరారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహాసభలకు రాష్ట్రమంత్రి సీతక్క హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.