byసూర్య | Tue, Nov 12, 2024, 09:51 PM
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం భూత్కూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం మంగళవారం ఉదయం బొలెరో వాహనంలో వెళుతుండగా జాతీయ రహదారిపై బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి జి. కవిత మధుసూదన్ రెడ్డి వనపర్తి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి గాయపడ్డ కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.