ఆరు గ్యారంటీలను తెలంగాణాలో అమలు చేస్తున్నాం ..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Nov 09, 2024, 02:55 PM

తెలంగాణలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ గారిచే సెప్టెంబర్ 17 2023 లో మేమిచ్చిన హామీలను తెలంగాణలో అమలు చేశామన్నారు.ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోదీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చానని… ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామన్నారు రేవంత్ రెడ్డి.


 


 


 


Latest News
 

నేడు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Wed, Apr 23, 2025, 10:53 AM
రైతులను దళారులను నమ్మవద్జు Wed, Apr 23, 2025, 10:30 AM
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM