షవర్మా తిన్న నలుగురు కస్టమర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు

byసూర్య | Sat, Nov 09, 2024, 02:39 PM

పదిహేను రోజుల క్రితమే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మూతపడిందా రెస్టారెంట్...! అన్నీ సర్దుకుని, మార్పులు చేర్పులు చేశాక మూడు రోజుల కిందటే యాజమాన్యం మళ్లీ తెరిచింది. అక్కడ షవర్మా బాగుంటుందనే పేరుండడంతో జనం మళ్లీ ఎగబడ్డారు. ఇటీవలే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న విషయం తెలిసీ ఆ రెస్టారెంట్ కు క్యూ కట్టారు. తాజాగా మరోసారి అదే రెస్టారెంట్ లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. షవర్మా తిన్న నలుగురు కస్టమర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు.హైదరాబాద్ లోని గ్రిల్ హౌస్ రెస్టారెంట్ లో చోటుచేసుకుందీ ఘటన. ఆసుపత్రిలో చేరిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పదిహేను రోజుల్లో రెండుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరగడంపై స్థానికులు సదరు రెస్టారెంట్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. గ్రిల్ హౌస్ రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ తెరిచే అవకాశం లేకుండా రెస్టారెంట్ ను మూసేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ Thu, Dec 11, 2025, 11:44 AM
ఏప్రిల్ నాటికి డీ సిల్టింగ్ పూర్తి చేయాలన్న హైడ్రా కమిషనర్ Thu, Dec 11, 2025, 11:41 AM
సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య Thu, Dec 11, 2025, 10:38 AM
మంచినీటి ట్యాంకుపై గాలిపటాలు: పిల్లల భద్రతపై ఆందోళన Thu, Dec 11, 2025, 10:32 AM
కేంద్ర విత్తన చట్టం-2025: రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత - మంత్రి తుమ్మల Thu, Dec 11, 2025, 10:28 AM