byసూర్య | Sat, Nov 09, 2024, 02:11 PM
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొమ్ము నరేష్, దేవిగారి బాబు వ్యవసాయ పొలం వద్ద నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో దొమ్మాట గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ పై నరేష్, బాబు ఇద్దరే ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దౌల్తాబాద్ 108 సిబ్బంది ఈఎంటి నవీన్, పైలట్ నర్సింలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి క్షతగాత్రులు ఇద్దరిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు అక్కడ చికిత్స పొందుతున్నారు....