హైడ్రాపై ఆందోళన అవసరం లేదని స్పష్టీకరణ

byసూర్య | Wed, Nov 06, 2024, 09:08 PM

హైడ్రా విషయమై బ్యాంకర్లకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధైర్యం చెప్పారు. బ్యాంకర్లు హైడ్రా కూల్చివేతల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాభవన్‌లో ఆయన బ్యాంకర్లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించాకే నిర్మాణాలకు అనుమతి ఇస్తాయని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాల రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందని బ్యాంకర్లకు తెలిపారు. కాబట్టి వారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలని హితవు పలికారు.


Latest News
 

రైతులను దళారులను నమ్మవద్జు Wed, Apr 23, 2025, 10:30 AM
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM