byసూర్య | Wed, Nov 06, 2024, 11:00 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కులగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో హైదరాబాద్ బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన సంప్రదింపులు,సలహాల సదస్సు కు రాహుల్ గాంధీ గారు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం నీలం మధు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చేపట్టిన కులగణన తో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని నీలం మధు స్పష్టం చేశారు. ఈ కులగణన తో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగడంతో పాటు వెనుకబడిన తరగతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే తోడ్పడుతుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ , ప్రజా ప్రతినిధులందరికీ బీసీ వర్గాల పక్షాన నీలం మధు ధన్యవాదాలు తెలిపారు.