byసూర్య | Wed, Nov 06, 2024, 10:33 AM
తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించారు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సర్వే కోసం 80 వేల మంది ఇన్యుమరెటర్లు, 18 వేల మంది సూపర్ వైజర్లకు శిక్షణ పూర్తి అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే కోసం 18, 723 మంది ఇన్యుమరెటర్లు, 1870 మంది సూపర్ వైజర్లను ప్రభుత్వం నియమించింది.