byసూర్య | Wed, Nov 06, 2024, 10:23 AM
తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రతలు పెరిగాయి. దట్టమైన పొగమంచుతో చలి పెరిగింది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నుండి రక్షించుకునేందుకు చలిమంటలు వేసుకుంటున్నారు. రాగల రోజుల్లో మరింత చలిగాలుల పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు