11 రోజుల్లోనే ఇన్ని వందల కోట్ల మద్యం తాగేశారా

byసూర్య | Sun, Oct 13, 2024, 10:40 PM

తెలంగాణలో పండుగంటే చుక్కాముక్కా ఉండాల్సిందే. అందులోనూ దసరా పండుగంటే మటన్ ముక్కా, మద్యం చుక్కా పడాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ పండుగకు మందుబాబులు పండుగ చేసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదారు రోజుల నుంచి మద్యం అమ్మకాలు 20 నుంచి 25 శాతం పెరిగినట్లు తెలిసింది. ఇక గతేడాది విజయదశమి సమయంతో పోలిస్తే.. గత ఐదు రోజుల్లో మద్యం అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ప్రతిరోజూ సగటున రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక అక్టోబర్ 10వ తేదీ అయితే ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యం వైన్‌ షాపులకు చేరింది. అలాగే 2.35 లక్షల బీర్లు వైన్ షాపులకు తరలించారు.


తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలుగా.. మరో వేయి వరకూ బార్లు, క్లబ్‌లు, పబ్‌లు ఉన్నాయి. ఇక దసరా పండుగ సీజన్ సందర్భంగా దుకాణాదారులు కూడా ముందు జాగ్రత్త పడ్డారు. డిమాండ్ ఉంటుందనే అంచనాతో ముందుగానే పెద్దఎత్తున నిల్వలు సిద్ధం చేసుకున్నారు. మామూలుగా అయితే ఒక్కో దుకాణంలో రోజుకు రూ.3 లక్షలు నుంచి రూ.4 లక్షల వరకూ మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ గత ఐదురోజులుగా ఈ అమ్మకాలు పెరిగాయి. గత ఐదురోజుల మద్యం అమ్మకాలను పరిశీలిస్తే .. రోజూ 2 లక్షల కేసుల బీర్లు, 1.20 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. మరోవైపు రేపు ఆదివారం కూడా ఉండటంతో మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వైన్ షాపుల యజమానులు అదనంగా నిల్వలు ఉంచుకున్నారు.


ఇక అక్టోబర్ నెల ప్రారంభమైనప్పటి నుంచి నిన్నటి వరకూ అంటే.. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 11 వరకూ 11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం మందుబాబులు తాగినట్లు తెలిసింది. ఇందులో 10.44 లక్షల కేసుల మద్యం, 17.59 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అయితే ఈ రెండు రోజులు హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు కాస్త తగ్గే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖతో పాటుగా వైన్ షాపుల యజమానులు కూడా చెప్తున్నారు. పెద్ద పండుగ కావటంతో అందరూ సొంతూర్లకు వెళ్లారని.. దీంతో హైదరాబాద్ సగం ఖాళీ అయ్యిందంటున్నారు. దీంతో ఈ రెండు రోజులు హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని అంచనా. అయితే జిల్లాల్లో మాత్రం మద్యం అమ్మకాలు జోరందుకోనున్నాయి.


Latest News
 

ఏడాది కాలంలో హైడ్రాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామన్న రంగనాథ్ Sat, Jul 19, 2025, 08:03 PM
పిల్లల దత్తత ప్రక్రియ.. ఇక చాలా సులభం Sat, Jul 19, 2025, 06:26 PM
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు..తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక హెచ్చరికలు జారీ Sat, Jul 19, 2025, 06:21 PM
అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ..ఉచితంగా రక్త పరీక్షలు Sat, Jul 19, 2025, 05:02 PM
ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ Sat, Jul 19, 2025, 04:54 PM